లగ్జరీ కార్లకు ప్రత్యేక టైర్స్​ 

లగ్జరీ కార్లకు ప్రత్యేక టైర్స్​ 

హైదరాబాద్, వెలుగు: లగ్జరీ కార్ల కోసం ' లెవిటాస్ అల్ట్రా ' పేరుతో కొత్త  టైర్లను జేకే టైర్స్ లాంచ్ చేసింది. మొత్తం 7 సైజ్ లలో వీటిని తీసుకొచ్చింది. ఈ టైర్లు  తక్కువ సౌండ్ చేస్తాయని, ఎక్కువ కాలం వస్తాయని కంపెనీ పేర్కొంది.   19–22 ఇంచుల సైజ్ ఉన్న టైర్లను త్వరలో తీసుకొస్తామని, దీంతో లగ్జరీ కార్ల సెగ్మెంట్ లోని అన్ని మోడల్స్ కోసం టైర్లను తీసుకొచ్చినట్టు అవుతుందని కంపెనీ పేర్కొంది.

ఫ్యూయల్ సేవింగ్ లో లెవిటాస్ అల్ట్రా కు 5 స్టార్ల రేటింగ్ వచ్చిందని తెలిపింది. ఇప్పటికే న్యూ ఢిల్లీ లో ఈ టైర్ల నేషనల్ లాంచ్ జరగగా, సౌత్ లో మొదటిసారిగా హైదరాబాద్ లో మంగళవారం లాంచ్ చేశారు. లెవిటాస్ అల్ట్రా టైర్లు వచ్చే నెల 1 నుంచి దేశంలోని అన్ని సిటీలలో అందుబాటులో ఉంటాయి.