V6 News

హైదరాబాద్‌‎‌‌‌లో జేఎల్‌‎ఎల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‎‌‌‌లో జేఎల్‌‎ఎల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ రియల్ ఎస్టేట్ కంపెనీ జేఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌,  హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌లోని ప్రెస్టీజ్ స్కైటెక్ భవనంలో 1.20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌‌‌‌‌‌‌‌ స్థలాన్ని లీజుకి తీసుకుంది.  వచ్చే ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఈ ఆఫీస్ ప్రారంభమవుతుంది.  ఇక్కడ సుమారు 1,600 మంది ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తారు.  ఇండియాలో  జేఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌కు  ఇది రెండో స్ట్రాటజిక్ సెంటర్‌.  

డేటా అనలిటిక్స్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ వంటి రంగాల్లో ఆధునిక పరిష్కారాలను ఈ సెంటర్ ర్వారా కంపెనీ అందించనుంది. అంతేకాకుండా  ప్రాజెక్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్, లీజ్ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ వంటి సేవలను బలోపేతం చేయనుంది.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌‌‌‌‌‌‌‌గా  జేఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ అభివర్ణించింది. కొత్త ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో హైబ్రిడ్ వర్క్ మోడల్ ఉంటుందని,  పర్యావరణానికి అనుకూలంగా రూపొందిస్తున్నామని, ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్, వెల్‌‌‌‌‌‌‌‌నెస్ సౌకర్యాలు ఇందులో ఉంటాయని తెలిపింది.