
జేఎల్‌ఎం, సబ్ ఇంజినీర్ క్యాండిడేట్స్ ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ‘మా ఉద్యోగాలు మాకిస్తారా.. చావమంటారా?’ అంటూ జూనియర్ లైన్‌మన్, సబ్ ఇంజినీర్ క్యాండిడేట్స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ జాబ్‌లకు 2018 ఫిబ్రవరిలోనే పరీక్ష జరిగినా ఇంకా నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాసిన క్యాండిడేట్స్ శుక్రవారం ఇందిరా పార్కు దగ్గర ఆందోళన చేపట్టారు. నియామకాలు మధ్యలో ఆగడంతో మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కోర్టు చిక్కులను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో ట్రాన్స్ కో సీఎండీ మాట్లాడి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయించి న్యాయపర చిక్కులను పరిష్కరించాలన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మద్దతు ప్రకటించారు.