డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ని అందుబాటులోకి తెచ్చిన జేఎన్టీయూ

డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ని అందుబాటులోకి తెచ్చిన జేఎన్టీయూ

డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ని అందుబాటులోకి తెచ్చినట్లు జేఎన్టీయూ ప్రకటించింది. స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరుతో ఆరు నెలల టైంలో వ్యాల్యూ యాడెడ్ కోర్సులను చేయవచ్చని ఈ సందర్భంగా జేఎన్టీయూ అధికారులు వెల్లడించారు.  

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్  వంటి కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేయొచ్చని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో టెక్నాలజీ పరంగా అవసరమైన మరిన్ని కోర్సులను కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.