
జెహనాబాద్(బీహార్): ‘నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొట్టేద్దాం’ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసిన జేఎన్‌యూ స్కాలర్ షర్జీల్ ఇమామ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బీహార్జెహనాబాద్ జిల్లాలోని తన పూర్వీకుల ఇంట్లో దాక్కున్న షర్జీల్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గుప్తేశ్వర్ పాండే చెప్పారు. షర్జిల్ను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు అప్పగించాలని కోరనున్నట్లు సమాచారం. అయితే, షర్జిల్ ను బీహార్లో ప్రశ్నిస్తారా.. లేక ఢిల్లీకి తరలించి అక్కడ ప్రశ్నిస్తారా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. యాంటీ సీఏఏ ఆందోళనలలో భాగంగా వివాదాస్పద కామెంట్స్ చేసిన షర్జిల్ పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో షర్జీల్ కొన్నిరోజులుగా పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, ఢిల్లీ పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బీహార్ పోలీసులకు తానే లొంగిపోయానని షర్జిల్ చెబుతుండగా.. వెతికి పట్టుకుని, అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.
ఎవరీ షర్జిల్ ఇమామ్?
32 ఏళ్ల షర్జిల్ జేఎన్‌యూలో పీహెచ్డీ స్కాలర్ ముంబై ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నడు. జామియా మిలియా యూనివర్సిటీ దగ్గర రెచ్చేగొట్టే కామెంట్స్ చేశారని ఆరోపణలున్నాయి.