
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో జరిగిన దాడిని నిరసిస్తూ యూనివర్శిటీ విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. దాడి ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. దాడుల నేపథ్యంలో జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తోన్న విద్యార్థినీ, విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీలో కొంతమందికి గాయలయ్యాయి.