
లండన్: ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని ప్రధానమంత్రి మోడీ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న మోడీ బిజీ బిజీగా గడుపుతున్నారు. గురువారం (జూలై 24) ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్టార్మర్తో చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇంగ్లాండ్, ఇండియా ప్రధానులు ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి సమయంలో భారతదేశానికి మద్దతు ఇచ్చినందుకు బ్రిటన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ | RSS చీఫ్ మోహన్ భగవత్ శాంతి ప్రేమికుడు..ముస్లిం మత పెద్దల ప్రశంసలు
ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచంలో ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదని.. తీవ్రవాద భావజాలం కలిగిన శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛలను దుర్వినియోగం చేయడానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబడవని స్పష్టం చేశారు. ఇక, ఆర్థిక నేరస్థుల అప్పగింతపై బిట్రన్, ఇండియా భద్రతా సంస్థల సహకారం, సమన్వయాన్ని పెంచుకోవడం కొనసాగిస్తాయని ప్రధాని మోడీ తెలిపారు.
2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది మరణించారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకని జరిగిన ఈ టెర్రర్ ఎటాక్ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించి ఇండియాకు మద్దతుగా నిలిచింది ఇంగ్లాండ్.