
నడక(Walking) ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మనందరికి తెలుసు.. ప్రతి రోజు నడక అనేక రోగాలను దూరం చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే చాలామందికి రోజు ఎంత సమయం వాకింగ్ చేయాలి.. లేదా ఎన్ని కిలోమీటర్ల నడవాలి.. ఎన్ని వేల అడుగులు నడవాలి.. వంటి విషయాలపై అనేక సందేహాలున్నాయి. ఈ సందేహాలకు సమాధానంగా ఇటీవల అధ్యయనాలు కొన్ని వాకింగ్ మెజర్మెంట్స్ ను సూచిస్తున్నాయి. అంతేకాదు లిమిట్ వాకింగ్ తో దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవని స్టడీస్ చెబుతున్నాయి.
ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు రోజుకు 10వేల అడుగులు వేయాల్సిన అవసరం లేదు...రోజుకు 7వేల అడుగులు వేయడం వల్ల క్యాన్సర్, నిరాశ ,అకాల మరణం వంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.
ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ (జూలై 2025) జర్నల్ లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ఈవిషయాన్ని వెల్లడించింది. లక్షా 60వేల మంది వయోజనుల నుంచి డేటాను సేకరించి విశ్లేషించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో రోజుకు సుమారు 7వేల అడుగులు వేయడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య ఫలితాల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించిందని కనుగొన్నారు.
►ALSO READ | ఆషాఢ అమావాస్య ... పితృ దేవతలు భూమిపై సంచరించే రోజు.. ఇలా చేయండి.. అనుగ్రహిస్తారు..
రోజుకు దాదాపు 2వేల అడుగులు వేసే వ్యక్తులతో పోలిస్తే రోజుకు 7వేల అడుగులు గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని (25 శాతం), క్యాన్సర్ (6 శాతం), టైప్ 2 డయాబెటిస్ (14 శాతం), డైమెన్షియా (38 శాతం), డిప్రెషన్(22 శాతం), ఆకస్మాత్తుగా పడిపోవడం (28 శాతం) తగ్గించడంలో సాయడుతున్నాయని అకాల మరణాలను దాదాపు 50 శాతం తగ్గించినట్టు తేలింది.
7వేల అడుగుల రోజువారీ నడక..క్యాన్సర్, నిరాశ,అకాల మరణంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఎఫెక్టివ్, ప్రూవ్ చేయబడిన వ్యూహం. స్థిరమైన, మితమైన శారీరక శ్రమ మీ మొత్తం ఆరోగ్య శ్రేయస్సుపై లోతైన ,సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పడానికి ఇదొక ఫ్రూఫ్.