ఆగస్ట్ 30న తెలంగాణ వర్సిటీలో జాబ్​ మేళా

ఆగస్ట్ 30న  తెలంగాణ వర్సిటీలో జాబ్​ మేళా

డిచ్​పల్లి, వెలుగు:  తెలంగాణ యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్​మేళా నిర్వహించనున్నట్లు హెచ్​వోడీ నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022– 24  మధ్యలో పీజీ పూర్తైన స్టూడెంట్స్​కు హెటీరో డ్రగ్స్​కంపెనీ లో జాబ్ ల కోసం ప్లెస్​మెంట్​డ్రైవ్​ఉంటుందని పేర్కొన్నారు. 

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్​, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ చదివిన స్టూడెంట్స్​పాల్గొనవచ్చని సూచించారు. క్యాంపస్​ లోని కంప్యూటర్​సైన్స్​హాల్ లో జాబ్ మేళా ఉంటుందని పేర్కొన్నారు.