సెప్టెంబర్ 17న కామారెడ్డిలో జాబ్ మేళా

సెప్టెంబర్ 17న కామారెడ్డిలో జాబ్ మేళా

కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజనీకిరణ్ సోమవారం  తెలిపారు. కలెక్టరేట్‌‌లోని ఫస్ట్ ఫ్లోర్ లో జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. 

హైదరాబాద్‌‌లోని హెట్రో కంపెనీలో జూనియర్ ఆఫీసర్ పోస్టుకు అర్హత ఎంఎస్సీ కెమిస్ట్రీ (ఆర్గానిక్, అనాలిసిస్, ఇనార్గానిక్), జూనియర్ కెమిస్ట్ పోస్టుకు అర్హత బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎం, బీకాం కావాలని చెప్పారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.