ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం

ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తాం

సిద్ధిపేట: భవిష్యత్తులో ప్రతియేటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఉద్యోగాల ఎంపిక కూడా పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసకుంటున్నామని...  గ్రూప్-1, 2 ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షతో తో ఉద్యోగ నియామకాలు ఉంటాయని ఆయన చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం, స్టడీ మెటీరియల్ అందజేత కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ త్వరలోనే 500 పైగా  గ్రూప్-1  ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేస్తామన్నారు.  గ్రూప్ -1లో కూడా 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని.. ఈ ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. 317జీఓతో అన్ని జిల్లాల ఉద్యోగులకు సమ న్యాయం చేస్తున్నామన్నారు.  దీనిపై ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు మాట్లాడటం తగదని విమర్శించారు. 
ప్రతిపక్షాల తీరు దున్నపోతు ఈనిందంటూ దూడ కట్టేయమన్నట్లుంది
317జీఓ సారాంశం తెలియకుండా బీజేపీ బండి సంజయ్ ఎందుకు దీక్ష చేపట్టారో.. ఏమిటో.. రాష్ట్ర ప్రతిపక్షాల తీరు చూస్తుంటే దున్నపోతు ఈనిందటే దుడ్డేను కట్టేయన్నట్లు ఉన్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న 15 లక్షల 65 వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ తెలపాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక్క రైల్వేశాఖలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపి నాయకులను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారని అన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇస్తామంటే మీకే పాలాభిషేకం చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రామిగా ఉన్నదని, బీజేపి నాయకులు నోరు పారేసుకోవడం తప్ప అస్సలు విషయం మాట్లాడడం లేదన్నారు. బీజేపి డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపి నాయకులకు దమ్ముంటే తెలంగాణలోని 23 జిల్లాలకు రావాల్సిన నవదయ స్కూల్స్ తేవాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేట గ్రంథాలయంలో జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మెసేజ్- సందేశం ద్వారా తెలుస్తుందన్నారు. 
 

ఇవి కూడా చదవండి

నిరుద్యోగుల ఉపాధి కోసం కొత్త జోనల్ వ్యవస్థ

కేసీఆర్, పీకే వ్యూహాలు ఇక పని చేయవు

టీఆర్ఎస్ తో పీకే టీం..మాణిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్