
ఓటీటీలు వచ్చాక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. దీంతో పలు భాషల్లో హిట్టైన సినిమాలను డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అలంటి మరో సినిమా ఓటీటీకి వచ్చేసింది. అదే జో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. హృదయానికి హత్తుకునే కథతో వచ్చిన ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు.
జో సినిమాలో అంతలా ఏముంది?
ఇదొక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. రాజా రాణి, ప్రేమమ్, హృదయం ఛాయలు కనిపిస్తాయి కానీ, ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. కాలేజ్ లైఫ్ ప్రేమలు, బ్రేకప్, డిప్రెషన్, చనిపోవాలనుకోవడం, ఆ తరువాత కొత్త జీవితం సింపుల్ గా చెప్పాలంటే ఇదే జో మూవీ కథ. చెప్పడానికి సింపుల్ గా ఉన్నా.. సినిమాలో ప్రీతీ సీన్ గుండెలకు హత్తుకుంటుంది. లవ్, ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అందుకే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ప్రేమ కథలను, మరీ ముఖ్యంగా ఎమోషనల్ కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచుతుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. వీలుంటే మీరు కూడా చేశాయండి.