
బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్‌ముఖ్ లీడ్ రోల్ లో నటించిన సినిమా 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. 'ఏక్ విలన్'కు సీక్వెల్‌గా వస్తున్న 'ఏక్ విలన్: రిటర్న్స్' లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఆకట్టుకోగా ఇవాళ విడుదలైన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచిందంటున్నారు. దిశా పటానీ గ్లామరస్ తో కనిపించింది. ట్రైలర్ చూస్తుంటేనే పక్కా యాక్షన్, సస్సెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తుంది. మోహిత్ సూరి తెరకెక్కించిన ఈ మూవీ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.