
బాల్కసుమన్ ను ఓడించాలని చెన్నూరు ప్రజలు కసిమీద ఉన్నారని కాంగ్రెస్ నేత గడ్డం వంశీకష్ణ అన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. స్టూడెంట్ లీడర్ నుంచి వచ్చిన బాల్కసుమన్ కు ఇవాళ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇసుక దందాతో బాల్కసుమన్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రతి రోజు 200 ట్రక్కులతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని చెప్పారు. దీని ద్వారా ఐదేండ్లలో దాదాపు 5 వేల కోట్లు ఇసుక దందాతో సంపాదించారని తెలిపారు. చెన్నూరులో నీతినిజాయితో పనిచేసే వారు కావాలని.. దోచుకునే వ్యక్తి వద్దని అన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని నల్లాల ఓదేలునివాసంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గడ్డం వంశీకష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఓదేలు,వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వంశీకృష్ణ.
చెన్నూరులో బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి జి.వెంకటస్వామి..బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలోకి దిగుతున్నారు.