ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలంటూ.. ఐటీడీఏ ఎదుట తుడుం దెబ్బ ధర్నా

ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలంటూ.. ఐటీడీఏ ఎదుట తుడుం దెబ్బ ధర్నా

ఉట్నూర్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని తుడుం దెబ్బ ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావు డిమాండ్​ చేశారు. సోమవారం ఉట్నూర్​ఐటీడీఏ ఎదుట తుడుందెబ్బ అధ్వర్యంలో ధర్నా చేశారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం ఇచ్చారు. బాపురావు మాట్లాడుతూ షెడ్యుల్డ్​ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ నిర్వహించాలని, ఐటీడీఏలోని బ్యాక్​లాగ్ ​పోస్టులను భర్తీ చేయాలన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేశారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. జీవో నంబర్​ 3ను యథావిధిగా కొనసాగించడంతో పాటు జీవో నంబర్​3 ప్రకారం ఉద్యోగులను బదిలీ చేసి, పదోన్నతులు ఇవ్వాలన్నారు. 29 ప్రభుత్వ శాఖల్లో జీవోలను చట్టాలుగా రూపొందించి అమలు చేయాలన్నారు. ఏజెన్సీలో 1/70 చట్టం, పెసా, అటవీ హక్కుల చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.

5వ షెడ్యుల్డ్​ప్రాంతంలో జీవో నంబర్​317ను రద్దు చేయాలన్నారు తుడుం దెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్సా పోషయ్య, వర్కింగ్​ అధ్యక్షుడు గెడం నగేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, లీడర్లు సోయం జంగు, కుడ్మెత తిరుపతి, కొడప నాగేశ్, నైతం రమేశ్, దాదెరావ్​ ఉన్నారు.