క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా ఎదగాలి : కల్నల్​ రమేశ్ సరియాల్​

క్రమశిక్షణతో ఉత్తమ పౌరులుగా ఎదగాలి : కల్నల్​ రమేశ్ సరియాల్​
  • గీతం ఎన్​సీసీ క్యాంప్​లో కల్నల్​ రమేశ్ సరియాల్​

రామచంద్రాపుం (పటాన్​చెరు), వెలుగు: క్రమశిక్షణ, దేశభక్తితో బాధ్యతాయుతమైన పౌరులుగా క్యాడెట్లు ఎదగాలని 33 బెటాలియన్​ కమాండింగ్​ ఆఫీసర్​ కల్నల్​ రమేశ్ సరియాల్ సూచించారు. మంగళవారం గీతం వర్సిటీలో 33వ బెటాలియన్​ ఎన్​సీసీ క్యాడెట్ల యాన్యువల్​ ట్రైనింగ్ క్యాంప్​ను ప్రారంభించి మాట్లాడారు. క్యాడెట్లు కఠినమై శిక్షన పొందేందుకు, నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంచుకునేందుకు క్యాంపులు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. అంకితభావం, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాడానికి ఎన్​సీసీ ఒక మంచి అవకాశమన్నారు.

శారీరక దృఢత్వం, మానసిక శ్రేయస్సు ఎంతో ముఖ్యమైనవని సూచించారు. ఈ క్యాంపులో 600 మంది క్యాడెట్లకు పది రోజల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇలాంటి క్యాంపులను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న గీతం వర్సిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో 9, 12, 32, 33 బెటాలియన్ల కమాండ్ అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు.