రామన్నగూడెంలో జాయింట్ సర్వే 

రామన్నగూడెంలో జాయింట్ సర్వే 

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట మండలం రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 30, 36, 39 లో సర్వే నిర్వహించి తమ భూములను అప్పగించాలంటూ రామన్నగూడెం గ్రామస్తులు ఏండ్ల తరబడి ఆందోళనలు చేపట్టారు.

మూడు సర్వే నెంబర్లలో 573 ఎకరాల భూమి వివాదంలో ఉందని ఫారెస్ట్, ఎఫ్ డీసీ, గిరిజనుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్వేయర్ల బృందంతో కలిసి ఆర్ఐ తాటి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జాయింట్ సర్వేను నిర్వహించారు. సర్వేనెంబర్ 30ని పూర్తి చేయగా, మరో రెండు నెంబర్లు సర్వే చేయవలసి ఉందని ఆర్ఐ తెలిపారు.