
మలయాళ నటుడు జోజు జార్జ్‌కు తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి ఫేమ్ ఉంది. తాజాగా తను హీరోగా ‘ఆషా’అనే పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశాడు. సఫర్ సనల్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని వినాయక అజిత్ నిర్మిస్తున్నారు.
కొచ్చిలోని త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో మంగళవారం పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేయడంతో పాటు రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మంగళవారం నుంచే ప్రారంభించారు.
ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ పాపులర్ నటి ఊర్వశి కీలక పాత్ర పోషిస్తున్నారు. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ కలిసి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఐదు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
జోజు జార్జ్ ఆషా మూవీ మంగళ వారం మొదలైంది. ఈ సినిమాలో ఊర్వశి.,ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సఫర్ సనల్ డైరెక్టర్ . ఈ సినిమాకు జోజు జార్జ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు .#JojuGeorge #malayalam pic.twitter.com/pXIY7W4qj8
— Tollywoodtopics (@filmytopics) July 15, 2025