
టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మూడో రోజు గ్రౌండ్ లో చేసిన పనిపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతను గిల్ దూకుడు శైలిని విరాట్ కోహ్లీ శైలితో పోల్చాడు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ లో మూడో రోజు ఆట చివర్లో హై డ్రామా చోటు చేసుకుంది. శనివారం (జూలై 12) ఆట ముగియడానికి 10 నిమిషాలు మిగిలి ఉన్న దశలో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ మూడో బంతిని ఎదుర్కొనే ముందు జాక్ క్రాలీ పదే పదే బుమ్రా బౌలింగ్ ఆడకుండా పక్కకి వెళ్ళిపోయాడు. దీంతో టీమిండియా ప్లేయర్స్ అసహనానికి గురయ్యారు.
కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంగ్లాండ్ కావాలనే సమయం వృధా చేస్తుందని భావించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ మాట్లాడాడు. గిల్ చేసిన పని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ కు నచ్చలేదు. టీమిండియాపై కెప్టెన్ పై విమర్శలు గుప్పించాడు. ట్రాట్ జియోహాట్‌స్టార్‌లో మాట్లాడుతూ.. "శుబ్‌మాన్ గిల్ నటన నాకు నచ్చలేదు. కెప్టెన్‌గా మీరు టోన్ పెద్దది చేసి మాట్లాడారు. మీరు ఒక కెప్టెన్ గా ప్రత్యర్థి ప్లేయర్ పై వేలు చూపించి మాట్లాడడం మునుపటి కెప్టెన్ ను గుర్తు చేస్తుంది. పోటీతత్వం టెస్ట్ క్రికెట్‌లో భాగమే అయినప్పటికీ, దానికి ఒక పరిమితి ఉంటుంది". అని ఈ ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ గిల్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
145/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 రన్స్‌కే ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట ముగిసే టైమ్‌కు 1 ఓవర్ ఆడి 2/0 స్కోరు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్), డకెట్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. బెన్ డకెట్, పోప్ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ కు చేరారు. ఈ రెండు వికెట్లను సిరాజ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 48 పరుగులుచేసింది. క్రీజ్ లో క్రాలీ (22), రూట్ (1) ఉన్నారు.
Jonathan Trott criticises Shubman Gill for his confrontation with Zak Crawley over time-wasting.#ENGvsIND pic.twitter.com/XI13M5qrmZ
— CricTracker (@Cricketracker) July 13, 2025