
కోల్‌కతా: రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌కు జరిమానా పడింది. గురువారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ‘బట్లర్ ఐపీఎల్ కోడ్‌ను అతిక్రమించాడు. ఆర్టికల్ 2.2లోని లెవెల్–1 స్థాయి ఉల్లంఘనకు పాల్పడ్డాడు. విచారణ తర్వాత అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు’ అని ఐపీఎల్ మీడియా అడ్వైజరీ వెల్లడించింది.
మ్యాచ్ సందర్భంగా బట్లర్ ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డాడో నిర్వాహకులు క్లారిటీ ఇవ్వలేదు. అయితే రనౌట్ సందర్భంగా అతని వ్యవహార శైలి సరిగా లేని కారణంగానే ఈ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టినా, క్రికెట్ ఎక్విప్‌మెంట్‌ను అగౌరవపర్చినా లెవెల్–1 తప్పిదం కిందకు వస్తుంది.