లండన్: బ్రిటన్ రన్నర్ జోష్ కెర్ అథ్లెటిక్స్‌లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మెన్స్ వన్ మైల్ (1.6 కి.మీ) పరుగును కెర్ 3 ని. 42.66 సెకన్లలో పూర్తి చేశాడు. దాంతో 1999లో రోమ్‌లో హిచామ్ ఎల్ గెరూజ్ (మొరాకో) నెలకొల్పిన 3ని. 43.13 సెకన్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఈ రేసుకు ముందు కెర్ కెరీర్ బెస్ట్ టైమింగ్ 3ని. 45.34 సెకన్లుగా ఉంది. 2024లో దీన్ని నమోదు చేశాడు. పారిస్ ఒలింపిక్స్‌లో 1500 మీటర్ల పరుగులో సిల్వర్ నెగ్గిన కెర్.. వన్ మైల్ రేసు కోసం పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాడు.
