హైదరాబాద్, వెలుగు: ప్రతిష్టాత్మకమైన 40వ హైదరాబాద్ సెయిలింగ్ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ చాంపియన్‌షిప్ ఘనంగా ముగిసింది. అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు దేశంలోని ఆర్మీ, నేవీ, సివిలియన్ సెయిలింగ్ సంస్థలకు చెందిన 19 సెయిలింగ్ క్లబ్ నుంచి 124 మంది సెయిలర్లు ఇందులో పాల్గొన్నారు. వీరిలో 19 మంది విమెన్స్ ఉన్నారు.
ఒలింపిక్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా అంతర్జాతీయ సెయిలింగ్ చాంపియన్‌షిప్ పతకాలు సాధించే క్రీడాకారుల వేదికగా హుస్సేన్ సాగర్ నిలిచిందని ఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్షిని అన్నారు. దేశవిదేశాల సెయిలర్స్‌తో పాటు హుస్సేన్ సాగర్ వేదికగా ఇండియా మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఐఎల్‌సిఎ ఓపెన్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించాలనే కల నిజమైందన్నారు.
