అమీన్పూర్, వెలుగు: న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన అమీన్పూర్ మండల రిపోర్టర్ విఠల్పై కొందరు వ్యక్తులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. మున్సిపల్ పరిధిలోని భవానీపురంలో సర్వేనంబర్630 ప్రభుత్వ భూమిలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తహసీల్దార్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో అధికార సిబ్బందితో కలిసి తహసీల్దార్వెంకటేశ్పరిశీలనకు వచ్చారు. ఈ క్రమంలో నిర్మాణం చేపట్టిన వ్యక్తులు తహసీల్దార్‌తో గొడవకు దిగడంతో తోపులాటలో తహసీల్దార్ కిందపడ్డారు.
ఇదంతా జర్నలిస్ట్ విఠల్ అక్కడే ఉండి కవర్ చేశారు. అదే రోజు రాత్రి కొంత మంది వ్యక్తులు మద్యం తాగి జర్నలిస్ట్ విఠల్ ఇంటికి వచ్చి బూతులు తిడుతూ ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. విఠల్ పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చే లోపు వారు వెళ్లిపోయారు. అనంతరం విఠల్ ఇంటి బయటకు రాగానే దుండగులు ఎదురుపడి పోలీసులు అడ్డుకుంటున్నా విఠల్పై దాడి చేశారు.
ఈ దాడిలో విఠల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం అమీన్పూర్ పీఎస్‌లో విఠల్ సీఐ నరేశ్‌కు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిలో తాను కొందరిని గుర్తించానని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వారందరిని చట్ట ప్రకారం శిక్షించాలని జర్నలిస్టు సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.
