జర్నలిస్టు రఘు అరెస్టు

జర్నలిస్టు రఘు అరెస్టు

కేతేపల్లి (నకిరేకల్:) వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల గుడిసెల కూల్చివేతను కవర్ చేయడానికి వెళ్తున్న జర్నలిస్ట్ రఘు, దాసరి శ్రీనివాస్‌తో పాటు మరి కొంతమందిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కొర్లపాడు టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది.  

కొద్దిసేపు పోలీసులు జర్నలిస్టుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  పేదల గుడిసెలను కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోమని, ప్రజల గొంతుకగా నిలబడతామన్నారు. అనంతరం పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెంట ఉన్న మరికొందరిని అరెస్ట్ చేశారు.