- సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట మహా ధర్నా
మెహిదీపట్నం, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఎ.మజీద్, జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ కోరారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లతో కార్మికులతో పాటు జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో యాజమాన్యాలను ఎదురించి పోరాడిన జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో 12 ఏండ్లుగా జర్నలిస్టులు నిరాధారణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమాచార శాఖ సంయుక్త సంచాలకుడు డి.ఎస్.జగన్ కు వినతిపత్రం ఇచ్చారు.
టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, లీడర్లు కె.రాములు, కె.సత్యనారాయణ, నగునూరి శేఖర్, యూసుఫ్ బాబు, అశోక్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.విజయ్ కుమార్ రెడ్డి, రమేశ్, ఫొటో, వీడియో జర్నలిస్టు సంఘాల నాయకులు గంగాధర్, కె.నరహరి, నాగరాజు, హరీశ్, గోపరాజు, శివశంకర్ గౌడ్, గౌస్, విమల, అత్తలూరి అరుణ, వాకటి మంజుల పాల్గొన్నారు.
