
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఏపీలోని విజయవాడలో సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆదిలాబాద్‌లోని ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు వెళ్లి ధర్నా చేశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో వినోద్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వేచ్చకు భంగం కలిగేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమన్నారు. ధనుంజయ్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల నిరసన
జన్నారం, వెలుగు: ఎలాంటి నోటీసులివ్వకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తు శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతో జర్నలిస్టులపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ చిలువేరు నర్సయ్య, జనరల్ సెక్రటరీ లింగన్నగౌడ్, సభ్యులు పాల్గొన్నారు.