- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నిర్మల్, వెలుగు: ఇండ్ల స్థలాల కేటాయింపుతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు పలు ప్రజా ఉద్యోగ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగన్న, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్, టీయూటీఎఫ్ నాయకులు రవికాంత్, మురళి మనోహర్ రెడ్డి, రాంజీ గోండ్ స్మారక సమితి జిల్లా కన్వీనర్ పోలీస్ భీమేశ్ తదితరులు జర్నలిస్టులకు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
