ఎకరానికి కోటి ఆరు లక్షలకు పాడి స్థలాన్ని దక్కించుకున్న ‘జాయ్ వెంచర్స్’ గ్రూప్

ఎకరానికి కోటి ఆరు లక్షలకు పాడి స్థలాన్ని దక్కించుకున్న ‘జాయ్ వెంచర్స్’ గ్రూప్

వేలంలో దక్కించుకున్న జాయ్ వెంచర్స్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపాలిటీ గంగారం శివారులోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని సోమవారం వేలం వేశారు. స్థానిక ఆర్డీఓ ఆఫీసులో నిర్వహించిన వేలంలో మొత్తం 40 మంది పాల్గొన్నారు. హైదరాబాద్​కు చెందిన ‘జాయ్ వెంచర్స్’ గ్రూప్ అత్యధికంగా ఎకరానికి కోటి ఆరు లక్షలకు పాడి మొత్తం స్థలాన్ని దక్కించుకుంది. ఈ మేరకు కలెక్టర్ నిఖిల వెల్లడించారు. వేలంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ విజయకుమారి, రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, జోనల్ మేనేజర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వికారాబాద్ జిల్లా అడిషనల్​కలెక్టర్(లోకల్ బాడీస్)గా రాహుల్ శర్మ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. 

పట్టు సాగులో అధిక లాభాలు పొందాలె

పట్టు సాగులో రైతులు అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల కు కలెక్టర్ నిఖిల సూచించారు. 3 రోజులపాటు నిర్వహిస్తున్న ఉద్యానవన, పట్టు పరిశ్రమ అవగాహన సదస్సు,  రైతు నైపుణాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హాజరై మాట్లాడారు. సబ్సిడీలను సద్వినియోగం చేసుకొని సూచించారు.