రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తనను అడిగి తెలుసుకున్నారని తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. హన్మకొండలో ఉంటున్న వెంకటనారాయణ ఇంటికి జేపీ నడ్డాతో బండి సంజయ్, బీజేపీ నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా వారు భేటీ అయిన విషయాలపై కూరపాటి వెంకటనారాయణతో v6 ముచ్చటించింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రశ్నించారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఏ అభిప్రాయంతో ఉన్నారు ..? ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత ప్రారంభమైంది..? ఇతరత్రా విషయాలను నడ్డా తనను అడిగి తెలుసుకున్నారని కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. సామాజిక న్యాయం లేకుండా పరిపాలన నడుస్తోందని, దీని నుంచి విముక్తి పొందాలని ప్రజలు అనుకుంటున్నట్లు జేపీ నడ్డాకు తెలియచేసినట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లా ఏదో హామీలు ఇవ్వమని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని నడ్డాకు తనకు చెప్పారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం జేపీ నడ్డాలో కనిపించిందన్నారు.
