న్యూఢిల్లీ: దేశంలో పార్టీ అధ్యకుల మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ స్పందించారు.
ఈ మేరకు ఖర్గేకు కౌంటర్ లేఖను రాశారు. రాహుల్ గాంధీని 'విఫల నాయకుడి'గా అభివర్ణించారు. అలాగే పలు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది.
“ప్రజలతో ఎన్నోసార్లు తిరస్కరించబడిన మీ విఫల నాయకుడిని బలవంతంగా ప్రజల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే అతణ్ని పదే పదే హైలెట్ చేస్తున్నారని.. అందులో భాగంగానే ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఆ ఉత్తరం చదివాక మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని నాకు అనిపించింది." అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ' యువరాజు' ఒత్తిడితో కాంగ్రెస్ 'కాపీ & పేస్ట్' పార్టీగా మారిందని నడ్డా ఆరోపించారు.
“ఆ లేఖలో మీరు రాహుల్ గాంధీతో సహా మీ నాయకుల అకృత్యాలను మరచిపోయారని, ఉద్దేశపూర్వకంగా వాటిని విస్మరించారని అనిపిస్తోంది. కాబట్టి ఆ విషయాలను వివరంగా మీ దృష్టికి తీసుకురావడం ముఖ్యం అని నేను భావించాను. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ కాపీ, పేస్ట్ పార్టీగా మారడం బాధాకరమన్నారు.