
- వర్చువల్గా జరుగనున్న సమావేశం
- నియోజకవర్గ కేంద్రాల్లో డిజిటల్ స్ర్కీన్లు
- 5 నుంచి 7 వరకు సెగ్మెంట్లలో పాలక్ ల మకాం
రాష్ట్రంలోని బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జ్లతో జనవరి 7న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్గా సమావేశం కానున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జ్లతో జనవరి 7న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్గా సమావేశం కానున్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ వేదికగా నడ్డా ప్రసంగిస్తారు. ఏ నియోజకవర్గంలోని వారు.. ఆ నియోజకవర్గ కేంద్రంలో ఒకే చోట ఈ సమావేశానికి హాజరవుతారు. నడ్డా స్పీచ్ ను అందరూ వినే రీతిలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పెద్ద, పెద్ద డిజిటల్ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో కనీసం 300 నుంచి 400 మంది బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జులు ఒకే చోట ఈ మీటింగ్లో పాల్గొంటారు. వీరిలో ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా ఇటీవల కొత్తగా నియమితులైన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్ లు పర్యవేక్షిస్తారు. నెలలో ప్రతి మూడు రోజులు పాలక్ లు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో బస చేయాల్సి ఉన్నందున ఈ నెల 5 నుంచి 7 వరకు వారు తమ తమ సెగ్మెంట్లలో ఉండనున్నారు. 7న జరిగే నడ్డా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.