కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో జనం విసిగిపోయారు

కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో జనం విసిగిపోయారు

తెలంగాణలో కమల వికాసం తథ్యమని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం ఆయనను గద్దె దింపాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. విపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రిని ఇంట్లో కూర్చోబెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న తన మాటను ప్రజలు నిజం చేశారని, దుబ్బాకలో రఘునందన్, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించి బీజేపీకి మరింత బలం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజల అభిమానం చూస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించడం ఖాయమన్న నమ్మకం కలుగుతోందని అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎంగా మారిందని నడ్డా ఆరోపించారు. స్వరాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయని సటైర్ వేశారు. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకు రావాలని పిలుపునిచ్చారు.