తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా

 తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా

హైదరాబాద్, వెలుగు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 31న ఆయన సంగారెడ్డికి రానున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే సభలో నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు. అదే రోజున సంగారెడ్డి నుంచే తెలంగాణలోని మరో నాలుగు జిల్లాల పార్టీ ఆఫీసులను వర్చ్యువల్ గా ప్రారంభించనున్నారు. వీటిలో వరంగల్, జనగామ, భూపాలపల్లి జిల్లా పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా రెండు  జిల్లాల పార్టీ ఆఫీసులను నడ్డా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.