
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కొల్లాపూర్, ఎల్లారెడ్డిలో నిర్వహించే ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. సినీ నటి కుష్బు జూబ్లీహిల్స్ లో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.