
2024 తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో(Telangana Lok Sabha Elections) పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.తమ ప్రాధమిక హక్కును వినియోగించుకుని..సోషల్ మీడియాలో విలువైన సందేశాలు ఇస్తున్నారు.
ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన ఫ్యామిలీతో కలిసి సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడి ఓటు వేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఓటు విలువైనది..అది మీ వజ్రాయుధం అంటూ ఓటు విలువ గురించీ మాట్లాడి వెళ్లిపోతుండగా అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.
సాధారణంగా ఎన్టీఆర్ అంటే అభిమానులకి చాలా ఇష్టం..పిచ్చి ఉంటుంది. చాలా వేదికలపై కూడా అభిమానుల ప్రేమ బయటపడింది. నేడు అలాంటి ఓ మధురమైన సంఘటనే ఓ అభిమానికి దక్కింది..ఎన్టీఆర్ వెళుతుంటే..ఓ అభిమాని పిలుస్తూ..'అన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు' ఇక వెంటనే ఎన్టీఆర్ అతని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు..ఆ సమయంలో అక్కడున్న మీడియాలో ఈ అరుదైన దృశ్యం రికార్డు అయ్యింది. గుండెలపై అంటే గుండెలపై కాదు...షర్ట్ మీద హార్ట్ ఉండే ప్లేసులో సంతకం చేశారు యంగ్ టైగర్. ఆ అభిమానికి ఈ సంతకం ఎప్పటికీ గుర్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా?!
ఇక అక్కడున్న వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..యంగ్ టైగర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Man of Masses @tarak9999 Spoke to media After Cast his vote ??#ManofMassesNTR #Devara pic.twitter.com/2IbSsFUP8A
— Jr NTR Fan Club (@JrNTRFC) May 13, 2024
ప్రస్తుతం ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ‘దేవర’(Devara) తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా దేవర.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.అలాగే ఎన్టీఆర్ వార్ 2 లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు.