ఆ విషయంలో నో ప్లాన్స్‌‌: ఎస్క్వైర్‌‌‌‌ ఇండియా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్

ఆ విషయంలో  నో ప్లాన్స్‌‌: ఎస్క్వైర్‌‌‌‌ ఇండియా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్

ఒక నటుడిగా కంటే ఎమోషన్స్‌‌తో కూడిన  నిజాయితీ గల మనిషిగా సమాజం తనను గుర్తిస్తే చాలని, అలాంటి గుర్తింపును ఆశిస్తున్నట్టు చెప్పారు ఎన్టీఆర్. ప్రముఖ మ్యాగజైన్‌‌ ‘ఎస్క్వైర్‌‌‌‌ ఇండియా’..  తమ తాజా ఎడిషన్‌‌ కవర్‌‌‌‌ పేజీపై ఎన్టీఆర్‌‌‌‌ ఫొటోను ప్రింట్‌‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌తో పాటు ఈ మ్యాగజైన్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌‌‌‌ చేసిన కామెంట్స్‌‌ వైరల్ అవుతున్నాయి. తన కుటుంబంలో సినీ వారసత్వం మున్ముందు ఏమవుతుందో ఇప్పుడప్పుడే తెలియదని, ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్‌‌ చేయలేదని చెప్పాడు.  

అయితే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే కథలను చెప్పడం ద్వారా జనం తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తానని తెలిపాడు. ఇక హృతిక్ రోషన్‌‌తో కలిసి ఎన్టీఆర్‌‌‌‌ నటించిన ‘వార్‌‌‌‌ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది.  అయాన్‌‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్‌‌ రాజ్ ఫిల్మ్స్‌‌ సంస్థ నిర్మించింది. కియారా అద్వాని హీరోయిన్‌‌గా నటించింది.  హిందీ,  తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది.