జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

 జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

దివంగత నటుడు నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) 67 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు స్మరించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్(JR NTR) ఎమోషనల్ ట్వీట్ చేస్తూ..తన తండ్రి హరికృష్ణని తలుచుని భావోద్వేగమయ్యారు. ‘ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే..అంటూ ఫోటో షేర్ చేశారు ఎన్టీఆర్. 

హరికృష్ణ..నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని పెళ్లికి హైదరాబాద్ నుంచి వెళ్తుండగా..నల్గొండ జిల్లా అన్నేపర్తి దగ్గర ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తన లైఫ్ లో సాధించిన బిగ్ అచీవ్ మెంట్స్ చూడకుండానే హరికృష్ణ చనిపోవడం ఎన్టీఆర్ చాలా బాధపడే విషయం.

ఎన్టీఆర్కు తన నాన్న హరి కృష్ణ అంటే.. భయం భక్తి ప్రేమతో ఉండేవారు. తన ఆడుగుజాడల్లోనే ఎన్టీఆర్ నడిచే వారు. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. చాలా వేదికల్లో మెన్షన్ చేశారు. కానీ తాను అంత ప్రేమించే తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోవడంతో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అవుతారు. అరవింద సమేత మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన తండ్రి గురుంచి మాట్లాడుతూ ఎన్టీఆర్ భావోద్వేగమైన విషయం తెలిసిందే. 

ఎన్టీఆర్ ఫ్యామిలీలో అన్న జానకి రామ్,తండ్రి హరికృష్ణ రొడ్డు ఆక్సిడెంట్లో చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లినా ఫ్యాన్స్కు జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్లాలని అంటూనే ఉంటారు. ఇంట్లో మీకంటూ ఉన్న కుంటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది..జాగ్రతమ్మా అంటూ.. తన ప్రతీ అభిమానికి పేరుపేరున చెప్పే ప్రయత్నం చేస్తుంటారు ఎన్టీఆర్. 

ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా దేవర(Derava). ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ(Koratala Shiva) కూడా దేవర బ్యాక్ డ్రాప్ ను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేశారు. ప్రపంచం మరిచిపోయిన ఓ సముద్రతీరప్రాంత నేపథ్యంలో.. తన వారిని కాపాడుకోవడానికి మృగాల్లాంటి వారితో పోరాటానికి దిగిన ఒక వీరుడు చేసిన పోరాటంగా ఈ సినిమాను రూపొందించనున్నారు కొరటాల. అందుకే ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.