దేవర కోసం శక్తి సెంటిమెంట్.. కొరటాలపైనే నమ్మకం

దేవర కోసం శక్తి సెంటిమెంట్.. కొరటాలపైనే నమ్మకం

జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్న సినిమా దేవర(Derava). ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల శివ(Koratala Shiva) కూడా దేవర బ్యాక్ డ్రాప్ ను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేశారు. ప్రపంచం మరిచిపోయిన ఓ సముద్రతీరప్రాంత నేపథ్యంలో.. తన వారిని కాపాడుకోవడానికి మృగాల్లాంటి వారితో పోరాటానికి దిగిన ఒక వీరుడు చేసిన పోరాటంగా ఈ సినిమాను రూపొందించనున్నారు కొరటాల. అందుకే ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. 

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతోంది. అదేంటంటే.. దేవర సినిమాలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్ర సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. అయితే ఎన్టీఆర్ ఇంతకుముందు శక్తి(Shakthi) సినిమాలోకి కూడా తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించారు. దర్శకుడు మెహెర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో చేసిన చెత్త సినిమా అంటే శక్తి సినిమా గురించే చెప్తారు. అంతలా ఎన్టీఆర్ పై ప్రభావం చూపించింది శక్తి మూవీ.

ఇప్పుడు మరోసారి అదే కాన్సెప్ట్ తో దేవర సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సారి కొరటాల శివపై నమ్మకంపెట్టుకున్నారు ఫ్యాన్స్. కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో ఇప్పటికే జనతా గ్యారేజ్(Janatha Garage) సినిమా వచ్చి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అందుకే దేవరపై కూడా నమ్మకం పెట్టుకున్నారు. దేవర విషయంలో ఎలాంటి తప్పు చేయడని నమ్ముతున్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ నమ్మకాన్నీ కొరటాల నిలిబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి మరి.