Jr NTR: ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’ ప్రీ రిలీజ్కు ఎన్టీఆర్.. ఫంక్షన్ ఎప్పుడంటే?

Jr NTR: ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’ ప్రీ రిలీజ్కు ఎన్టీఆర్.. ఫంక్షన్ ఎప్పుడంటే?

విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 12న గ్రాండ్ గా నిర్వహించనున్నారు మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నాడట. ఇప్పటికే కళ్యాణ్ రామ్ సైతం ఎన్టీఆర్తో మాట్లాడినట్లు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. దాంతో 'అన్న కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి దిగనున్న తమ్ముడు' ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వీరిద్దరూ తమ తమ సినిమా ఫంక్షన్స్లో కనబడి ఎంతో జోష్ పెంచారు.

ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ వచ్చి టీమ్కి ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. ఒక్కో టెక్నీషియన్ గురించి మాట్లాడి వారి టాలెంట్స్ని ప్రత్యేకంగా  మెచ్చుకున్నాడు. ఇక ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’స్టేజీపై తారక్ ఏం మాట్లాడున్నాడనేది ఆసక్తి నెలకొంది. 

ఈ మూవీకి అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందించాడు.  సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.