నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఎన్టీఆర్తో ఉన్న పాప ఎవరో తెలుసా?

నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఎన్టీఆర్తో ఉన్న పాప ఎవరో తెలుసా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కు సంబందించిన ఒక ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ తన ఒడిలో ఒక పాపను కుర్చోబెట్టుకొని కనిపించారు. దీంతో ఎన్టీఆర్ తో ఉన్న ఆ పాప ఎవరు అంటూ.. ఎక్కడ చూసిన ఈ  ఫోటో గురించే చర్చ నడుస్తోంది.

దీంతో ఆ పాప మరెవరో కాదు నా మేనకోడలు అంటూ స్పందించాడు జబర్దస్త్ రామ్ ప్రసాద్. అవును ఆ ఫొటోలో ఎన్టీఆర్ తో ఉన్న ఆ క్యూట్ పాప మరెవరో కాదు జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ మేనకోడలట. ఈ విషయాన్ని స్వయంగా రామ్ ప్రసాద్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇక ఈ ఫోటో దేవర షూటింగ్ లో ఎన్టీఆర్ ను రామ్ ప్రసాద్ కలవడానికి వెళ్ళినప్పుడు తీసుకున్నదని తెలుస్తోంది.    
 
ఇక ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటించనున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా 2024 లో వచ్చే అవకాశం ఉంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ రెండు సినిమాల కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.