హైదరాబాద్‌లో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల..అదనపు ఫీచర్లు, అప్‌గ్రేడ్స్

హైదరాబాద్‌లో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల..అదనపు ఫీచర్లు, అప్‌గ్రేడ్స్

జేఎస్‌‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సోమవారం హైదరాబాద్​లో ఆల్-న్యూ ఎంజీ  హెక్టర్‌‌ను విడుదల చేసింది. 2026 ఎంజీ హెక్టర్ ఫేస్‌‌ లిఫ్ట్ ప్రారంభ ధర రూ.12 లక్షలని (ఎక్స్-షోరూమ్) తెలిపింది.  

ఇందులో కాస్మెటిక్  అప్‌‌గ్రేడ్‌‌లు, అదనపు ఫీచర్లు, కొత్త సేఫ్టీ టెక్నాలజీలు ఉన్నాయి. కొత్త  ఆరా హెక్స్  గ్రిల్,  కొత్త బంపర్‌‌లు, 14-అంగుళాల టచ్‌‌స్క్రీన్, ఐ-స్వైప్  జెస్చర్ కంట్రోల్స్ వంటి ప్రత్యేకతలను చేర్చామని ఎంజీ తెలిపింది.  

రిమోట్ ఏసీ కంట్రోల్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అలర్ట్‌‌లతో పాటు డిజిటల్ బ్లూటూత్ కీ వంటి ఫీచర్లూ దీని సొంతం.