టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ శుభారంభం

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ శుభారంభం

బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌: ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షోతో ఆకట్టుకున్న బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు.. టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేసింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో జువైరియా ఫెర్దౌస్ (50), షర్మిన్‌‌‌‌‌‌‌‌ అక్తర్‌‌‌‌‌‌‌‌ (37 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 6 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది.

టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 139/8 స్కోరు చేసింది. బబెట్టి డి లీడె (50) హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేసినా మిగతా వారు నిరాశపర్చారు. మరుఫా అక్తర్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీసింది. తర్వాత బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 19.1 ఓవర్లలో 141/4 స్కోరు చేసింది. ఫెర్దౌస్, దిలారా అక్తర్‌‌‌‌‌‌‌‌ (26) మెరుగ్గా ఆడారు. కరోలిన్‌‌‌‌‌‌‌‌ డి లాంజ్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు పడగొట్టింది. ఫెర్దౌస్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.