సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌‌ను గెలిపిస్తయ్ : జూపల్లి

సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌‌ను గెలిపిస్తయ్ : జూపల్లి
  • జూబ్లీహిల్స్‌‌లో నవీన్ యాదవ్‌‌దే గెలుపు: జూపల్లి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు తథ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బోరబండ డివిజన్‌‌లో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌‌ విజయానికి దోహదపడతాయన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ఆర్థికంగా మహిళలు ఎదిగేలా  ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 

నవీన్ యాదవ్ స్థానిక నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని, ఆయన గెలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్‌‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

మధురానగర్‌‌‌‌లో తుమ్మల..  

మధురానగర్ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలిసిన వ్యక్తి నవీన్ యాదవ్‌‌ను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.