హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నిర్వహణకు ఉపయోగించే బ్యాలెట్ యూనిట్ల (సప్లిమెంటరీ)ర్యాండమైజేషన్ను ఆదివారం చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో చేపట్టారు. నోటాతో కలిపి మొత్తం 59 అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణకు అదనంగా బ్యాలెట్ యూనిట్ల అవసరం అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి బ్యాలెట్ యూనిట్ లను కేటాయించారు.
