హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి యువతీ యువకులు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ పోలింగ్‌కేంద్రంలో చూసినా ఈసారి యువతీ యువకులే ఎక్కువ సంఖ్యలో కనిపించారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేశారు. ఈసారి కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారితో పాటు 35 ఏండ్ల లోపు వారు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. ఒక రోజు సెలవుగా కాకుండా, ఇది నా బాధ్యతగా భావించి ఓటు వేశామని పలువురు యువత తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 18–19 ఏండ్ల వయస్సున్న ఓటర్లు 6,859 మంది ఉన్నారు.
