- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలో తప్పేముందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలపై జరుగుతున్న చర్చలో తప్పులేదని చెప్పారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్‌లో సీట్లు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టీడీపీ కూడా ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
అలాంటప్పుడు బీఆర్‌ఎస్ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకున్నా తప్పేమీ లేదన్నారు. ఐదేళ్లు తమతో సేవలు చేయించుకుంటున్న సిటీ జనం.. ఓటింగ్ రోజున మాత్రం గ్రామాలకు వెళ్తున్నారని, దీంతో నగరంలో పోలింగ్ శాతం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
