పద్మారావునగర్, వెలుగు: తిరుమలగిరి పరిధిలోని 64 కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం పికెట్లోని తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం భరోసానిస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ సహాయం అందడంలో జాప్యం జరిగేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలుస్తూ చెక్కుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు.
