హైదరాబాద్, వెలుగు: రైతులకు మేలు చేసేలా పంటల బీమాను అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం వ్యవసాయ బడ్జెట్పద్దులపై అసెంబ్లీలో మంత్రి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించని విధంగా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.
అమెరికా నుంచి దిగుమతి కాటన్, పామాయిల్‌పై ఇంపోర్టెడ్ డ్యూటీ తొలగించడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, యూరియా కొనుగోళ్లలో కేంద్రం సరైన తీరును పాటించలేదని తెలిపారు.
