జూబ్లీహిల్స్ బైపోల్ : ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్

జూబ్లీహిల్స్  బైపోల్ : ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్

జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పోలింగ్ కాస్త నెమ్మదిగా జరిగినా.. గంట గంటకి నెమ్మదిగా  ఓటింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్నం వచ్చే వరకు పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదయ్యింది. చివరి రెండు గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్​లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్​కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్​బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు.

పర్సంటేజ్ ఇలా


ఉదయం 7 గంటల నుంచి 9గంటల వరకు: 10.02 శాతం
ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు 20.76
ఉదయం 11గంటల నుంచి ఒంటి గంట వరకు 31.94