జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది.ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనున్నారు. గంట గంటన్నర లోపు ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటల వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.
మూడో రౌండ్ లో వెంగళ్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ ఓట్లు లెక్కింపు
రెండో రౌండ్
కాంగ్రెస్ - 9,691 ఓట్లు
బీఆర్ఎస్ -8,609 ఓట్లు
రెండో రౌండ్ ముగిసే సరికి 1144 కాంగ్రెస్ లీడ్
- రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 1082 ఓట్ల ఆధిక్యం
- తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యం
మొదటి రౌండ్
- కాంగ్రెస్ - 8,926
- బీఆర్ఎస్ - 8864
మొదటి రౌండ్ లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ
జూబ్లీహిల్స్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
షేక్ పేట డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ
పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు
- కాంగ్రెస్ -39
- బీఆర్ఎస్ -36
- బీజేపీ-10
- పోస్టల్ బ్యాలెట్లలో పదుల సంఖ్యలో చెల్లని ఓట్లు
- పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కు ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది..
- ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు
- షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు
- మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- హోమ్ ఓటింగ్ ద్వారా వేసిన 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- హోమ్ ఓటింగ్ ద్వారా 101 ఓట్లు వేసిన వృద్ధులు, వికలాంగులు
సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి.. ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, 186 మంది సిబ్బందిలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు. అప్‌డేట్స్‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
పార్టీల్లో ఉత్కంఠ
జూబ్లీహిల్స్‌లో విజేత ఎవరనేదానిపై ప్రధాన పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, తమ విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు భారీ మెజార్టీ వస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావని, తమ అంచనాలే నిజమవుతాయని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తమ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధిస్తారని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య ఓట్లు చీలి తమ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ వెలువడే ఫలితం ఉత్కంఠను పెంచనుంది. ఐదారు రౌండ్లలోపే గెలుపు అవకాశాలు తేలనున్నాయి.
